నిర్బంధాలతో పోరును ఆపలేరు
షాద్‌నగర్: అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రభుత్వం తమ పోరాటాన్ని ఆపలేరని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్ నాయక్ పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం పోలీసులు ఆయనతో పాటు పలువురు గిరిజన సంఘం నాయకులను బైపాస్‌లోని రసోయ్ హోటల్ వద్ద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాంబల్ నాయక్ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు గిరిజనులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇటీవల లగచర్లలో జరిగిన ఘటనపై ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటుగా, కేంద్ర వర్గాలకు కలిసినట్లు తెలిపారు. లగచర్లలో గిరిజనులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో లక్ష్మణ్‌నాయక్, చందునాయక్, లిబియానాయక్, ఏకనాథ్‌నాయక్, రాజునాయక్, శ్రీనివాస్, జగన్, మోహన్‌న్, బాబు, రాజేందర్, అంబదాస్, భోజ్యానాయక్ తదితరులు ఉన్నారు.
నేతల ముందస్తు అరెస్టు
మంచాల: లగచర్ల ఘటనపై గిరిజన, ప్రజాసంఘాల పిలుపుతో బుధవారం పోలీసులు అప్రమత్తమయ్యాయి. మండలంలోని గిరిజన సంఘాల నాయకులు కొర్ర శ్రీనివాస్‌నాయక్, వెంకటేష్, రవీందర్‌లను తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు చేసి మంచాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశ్రమల పేరుతో భూములను లాక్కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుట్రలు మానుకోవాలన్నారు. సాగుకు యోగ్యం కాని భూములను తీసుకోవాలన్నారు.
గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్
బొంరాస్‌పేటలో నేతల అరెస్టు
ఆమనగల్లు/కడ్తాల్: ఇటీవల లగచర్లలో జరిగిన వివాదంలో అమాయక గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ గిరిజన నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం లగచర్లకు తరలివెళ్లారు. ఈ క్రమంలో కడ్తాల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్, బీఆర్‌ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్, మాడ్గుల మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, మాజీ ఎంపీటీసీలు నాగులునాయక్, లచ్చిరాంనాయక్, మాజీ సర్పంచ్‌లు తులసీరాం నాయక్, లోకేశ్‌నాయక్, హరిచంద్‌నాయక్ తదితరులను బొంరాస్‌పేట మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకుని ఠాణాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment