గాయపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
యాచారం: మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై మూలుగుతున్న స్థితిలో యాచారం పోలీసులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఏలూరి రామాంజనేయులు బుధవారం ఉదయం మండలంలోని అయ్యవారిగూడెం అనుబంధ గ్రామం ఎనెకిందతండా సమీపంలోని ఎతైన గుట్టపైకి ఎక్కి గాయపడ్డాడు. ఆయనకు మతిస్థిమితం సరిగా లేదు. స్థానికంగా ఉండే సభావట్ వినోద్ ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ మధు అగ్నిమాపక, పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో ఉన్న రామాంజనేయులును కాపాడి గుట్టపై నుంచి కిందకు తీసుకువచ్చారు. వెంటనే ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు కూడా సంఘటన స్థలానికి వచ్చి గాయపడిన వ్యక్తిని పరిశీలించారు. సదరు వ్యక్తి ఎందుకు గాయపడ్డాడు, అసలు ఎక్కడికి ఎందుకు వచ్చారో ఇంకా వివరాలు తెలియరాలేదు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ఏసీపీ రాజు యాచారం పోలీసులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment