సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల్లో అభిరుచిని పెంచేందుకు డిఫెన్స్, స్పేస్ కన్వెన్షన్–2024 సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, భారత రక్షణ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి అన్నారు. బుధవారం గురునానక్ విశ్వవిద్యాలయంలో భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రపంచంలోని డిఫెన్స్, స్పేస్ రంగాల్లో నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, నైపుణ్యం, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి పలు ముఖ్యమైన విషయాలపై చర్చించారు. శాస్త్ర, సాంకేతిక, టెక్నాలజీ, ఇంజీనిరింగ్ మరియు మేనేజ్మెంట్ వంటి విభాగాలలో భవిష్యత్ నాయకులుగా ఎదగడానికి కావాల్సిన సామర్థ్యాలు, విద్యావకాశాలపై వివరించారు. అనంతరం డాక్టర్ సతీష్‌రెడ్డి యువతకు సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలు వాటి అవసరాలు, అలవర్చుకునే విధానాలను వివరించారు. డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత గాథలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజాసింగ్ తంగదురై, డీఆర్డీఎల్ డాక్టర్ అశోక్ కుమార్ పాండే, హెచ్ఓడీ ఏరోస్పేస్ ఇంజినిరింగ్ ఐఐటీ హైదరాబాద్ కె.శ్రీనివాస్ రాజు, గురునానక్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, చాన్సలర్ సర్దార్ గగన్ దీప్‌సింగ్, విద్యాసంస్థల ఎండీ, వీసీ డాక్టర్ హెచ్ ఎస్ సైనీ, డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ సంజీవ శ్రీ వాస్తవ, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి.పార్థసారధి, ప్రిన్సిపాల్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతతరం సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలను విద్యాసంస్థల వైస్ చైర్మన్, చాన్సలర్ గగన్ దీప్‌సింగ్ ఘనంగా సత్కరించారు.
డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి
గురునానక్ వర్సిటీలో డిఫెన్స్,స్పేస్ కన్వెన్షన్–2024 సదస్సు
పాల్గొన్న శాస్త్రవేత్తలు
Comments
Please login to add a commentAdd a comment