● ‘పట్నం’ పరిధిలో నిర్మాణ దశలో..
ఇబ్రహీంపట్నం ఎంఎస్‌ఎంఈలో నిర్మించిన షెడ్లు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలో పలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు పనులు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఖాల్సా రెవెన్యూ పరిధిలోని 76 నుంచి 108 సర్వే నంబర్లలో సుమారు 450 ఎకరాల భూమిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ పదేళ్ల క్రితం సేకరించింది. ఇందులో గుట్టలను పగులగొట్టి, గోతులను పూడ్చి రోడ్లను వేశారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారిలోని కట్టపై ఇబ్రహీం బాషా దర్గా నుంచి డబుల్ బీటీ రోడ్డు, ఇబ్రహీంపట్నం నుంచి గోసాల వెళ్లే రోడ్డులో ఉడుగుల పోచమ్మ దేవాలయం ఎదురుగా మరో మార్గాన్ని (బీటీ రోడ్డు) క్లస్టర్ పార్కుకు వెళ్లేందుకు నిర్మించారు. ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్, హైదరాబాద్ ప్రధాన రహదారికి ఈ రోడ్లను అనుసంధానం చేశారు. రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. నగరం నుంచి ఈ క్లస్టర్ పార్కుకు రావాలంటే 30 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ దశగా కొన్ని కంపెనీలకు టీఎస్‌సీసీఐ భూముల కేటాయింపు జరిపింది. సుమారు ఆరేడు కంపెనీలు షెడ్ల నిర్మాణం పూర్తికాగా పలు కంపెనీల షెడ్ల నిర్మాణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం క్లస్టర్ పార్కులో నిర్మాణ మేసీ్త్రలు, కూలీలు, సెక్యూరిటీ గార్డులు మాత్రమే అక్కడ పనులు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి
క్లస్టర్‌పార్కులో నిర్మాణంలో ఉన్న కంపెనీలు ప్రారంభమైతే ఇబ్రహీంపట్నం ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఇక్కడి వాళ్లకే కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ఉపాధి కోసం ఇక్కడికి తరలివస్తారు. దీంతో వ్యాపారాలు సైతం పుంజుకునే అవకాశం ఉంటుంది. సుమారు 70 నుంచి 100కు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పేందుకు అవకాశాలున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
నిర్మాణంలో ఉన్న వివిధ కంపెనీల షెడ్లు
Comments
Please login to add a commentAdd a comment