శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న
● పలు కంపెనీల ఏర్పాటుకు ఆసక్తి
● ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పూర్తి
● మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో..
● అన్నీ పూర్తయితే స్థానిక యువతకు పెరగనున్న ఉపాధి అవకాశాలు
● టీజీఐఐసీ ఆధీనంలోనే..
కొత్తూరు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో మండలంలోని సిద్ధాపూర్‌లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించింది. అనంతరం అసైన్డ్ రైతులకు పరిహారం అందజేసి సుమారు 330.34 ఎకరాల భూసేకరణ చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం భూములను ప్రభుత్వం టీజీఐఐసీకి బదలాయించింది. భూసేకరణ ప్రక్రియ జరిగి సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ పరిశ్రమలకు కేటాయించలేదు. తమ పొలాలను తీసుకున్న ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి లభిస్తుందని అప్పట్లో స్థానికులు ఆశలు పెట్టుకున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో వారు ఎదురు చూస్తున్నారు.
భూసేకరణ ఇలా..
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం సిద్ధాపూర్‌లోని సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములు 330.34 ఎకరాలను సేకరించి టీజీఐఐసీకు బదలాయించింది గత ప్రభుత్వం. ఇందులో సుమారు 97.24 ఎకరాలు ప్రభుత్వ పొలం కాగా 160 ఎకరాలు అసైన్డ్, మిగతా 73.1 ఎకరాలు ఖాళీగా ఉంది. అప్పటి ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఎకరానికి రూ.10.50 లక్షలు పరిహారంగా అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment