పల్లె ప్రగతి పనులు భేష్
షాబాద్: పల్లెప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతో బాగున్నాయని ఢిల్లీ అధికారుల బృందం సభ్యులు కితాబిచ్చారు. అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టడీ ఇన్ రూరల్ ఏరియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి 12 మంది సీనియర్ అధికారుల బృందం మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామాన్ని సందర్శింది. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్ట్ యార్డు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, హరితహారం నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ తదితరాలను బృందం సభ్యులు పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి ఎస్‌హెచ్‌జీ గ్రూపుల వినియోగాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరుగాంచిన సర్దార్‌నగర్ పశువుల సంతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనులు బాగున్నాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ, జెడ్పీ సీఈఓ సీహెచ్ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్‌మోహన్, ఎంపీడీఓ అపర్ణ, డీఎల్పీఓ సతీశ్, ఎంపీఓ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మునగపాటి నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి కవిత, టెక్నికల్ అసిస్టెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ అధికారుల బృందం కితాబు
Comments
Please login to add a commentAdd a comment