‘ఉపాధి’ని వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగ అనుబంధ పనులకు అనుసంధానం చేయడం జరిగిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.శ్రీలత పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు, భారత రాజ్యాంగ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడులో నాటు కోళ్ల పెంపకానికి మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొందిన బుట్టి రాధికకు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.2,99,600తో కోళ్ల షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఉపాధి హామీలో ఎక్కువ పనిదినాలు చేసిన కవిత, మొక్కలు పెంపకంలో శ్రద్ధ వహించిన గణేశ్, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలు రాములమ్మను సత్కరించారు. భారత రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. రైతులకు ఎన్నో అవకాశాలు కల్పించం జరుగుతోందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు . ఎంబ్రాయిడింగ్, వర్కు, రెడీమేడ్ బట్టల షాపు, గూడ్స్ ట్రాలీ, బోరు మోటర్లు బావి నుంచి తీసే యంత్రం మొదలైన యూనిట్లు నిర్వహిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. లోను పూర్తి చేయగానే పెద్ద మొత్తంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల్లో ఇప్పటి వరకు సభ్యులుగా లేని వారిని సంఘాల్లోకి ఆహ్వానించి సభ్యులుగా చేర్చుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నవీన్‌రెడ్డి, ఏపీడీ నరేందర్‌రెడ్డి, ఏపీడీ సూర్యారావు, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ లక్పతినాయక్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఏపీఓ తిరుపతాచారి, ఐకేపీ ఏపీఎం రవీందర్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, సీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ పీడీ శ్రీలత
Comments
Please login to add a commentAdd a comment