దళారులను నమ్మి మోసపోవద్దు
మహేశ్వరం: సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుందని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహా రావు పేర్కొన్నారు. కందుకూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా పంటల సాగు, అధునిక పద్ధతుల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలన్నారు. ఏ రకం వరి ధాన్యం క్వింటాల్‌కు ధర రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఆయిల్‌పాం పంటల సాగు గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ సుధారాణి, మండల వ్యవసాయాధికారి కృష్ణమోహన్, మండల ఉద్యానవన అధికారి సౌమ్య, ఏఈఏలు రాజు, జగదీశ్వర్‌చారి, రాఘవేంద్రచారి, శ్రీహరి, సమియిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
Comments
Please login to add a commentAdd a comment