చెడ్డీ గ్యాంగ్ వీరంగం
షాద్‌నగర్ రూరల్: గతంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రెచ్చిపోతోంది. తాళం వేసిన ఇంటికి కన్నం వేసి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సోమవారం పట్టణంలోని విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు.. శ్రీనివాస్‌రెడ్డి అనూష దంపతులు పట్టణంలోని విజయనగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా శ్రీనివాస్‌రెడ్డి రోజుమాదిరిగానే కొత్తూరు మండలం తిమ్మాపూర్ సమీపంలోని విన్స్‌బయో పరిశ్రమలో విధులకు వెళ్లాడు. ఆయన భార్య అనూష తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. చెడ్డీ, బనియన్ వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం ఇనుపరాడ్డుతో కాలనీలోకి ప్రవేశించాడు. అక్కడే కూర్చున్న వృద్ధురాలు అనంతమ్మ ఎవరు నువ్వు అని ప్రశ్నించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయి శ్రీనివాస్‌రెడ్డి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. విధుల నుంచి వచ్చిన ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేసి ఉండడం గమనించి బీరువాను పరిశీలించగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంటికి కన్నం
20 తులాల బంగారు ఆభరణాలు చోరీ
Comments
Please login to add a commentAdd a comment