రేపు జిల్లాకు ఉప రాష్ట్రపతి
● రెండు రోజుల పాటు కన్హా శాంతి వనంలోనే ● ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ కన్హ శాంతి వనంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం చేగూరులోని కన్హ శాంతివనంలో కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప రాష్ట్రప తి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు తమకు కేటాయించిన విధుల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
షాద్‌నగర్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీపాద్‌నాయక్ సోమవారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రికి శంషాబాద్ విమానాశ్రయంలో షాద్‌నగర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట నాయకులు విజయ్‌భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్‌సింగ్, చేగు సుధాకర్, మహేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, మిద్దె గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు
డీసీసీబీ జాయింట్ రిజిస్ట్రార్
సూర్యచందర్‌రావు
యాచారం: దీర్ఘకాలిక రుణాల వాయిదాలు చెల్లించని రైతులు ఈనెల 30లోగా చెల్లించకుంటే ఆస్తుల జప్తు తప్పదని డీసీసీబీ జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచందర్‌రావు హెచ్చరించారు. సోమవారం ఆయన యాచారం పీఏసీఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ నాగరాజుతో మాట్లాడి పీఏసీఎస్‌లో దీర్ఘ కాలిక రుణాలు తీసుకుని వాయిదాలు చెల్లించని రైతుల వివరాలు తెలుసుకున్నారు. 700 మంది రైతులు పదేళ్లుగా రూ.10కోట్ల బకాయి చెల్లించలేదని.. నోటీసులిచ్చినా స్పందన లేద ని చెప్పారు. అనంతరం చౌదర్‌పల్లి, యాచారం, నందివనపర్తి గ్రామాల్లో పర్యటించి మొండి బకాయి రైతులను కలిసి 30లోగా బకాయిలు చెల్లించాలని సూచించారు. లేదంటే నింబంధనల ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. పలువురు రైతులకు లీగల్ నోటీసులిచ్చారు. డీసీసీబీ లీగల్ సెక్షన్ అధికారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
దుద్యాల్: ‘ఈ ప్రాంత గిరిజనులకు భూములే జీవనాధారం.. అలాంటి పొలాలను లాక్కోవాలని చూశారు.. భూములు ఇవ్వమన్నందుకే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. లగచర్ల ఘటనలో బెయిల్‌పై వచ్చిన రైతులను సోమవారం ఆమెపరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జైలులో ఉన్న మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను షరతులు లేకుండా ఎత్తివేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. జైలులో ఉన్న తమ వారిని విడిపించాలని ఎంపీ డీకే అరుణ కాళ్లమీద పడి వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment