28 నుంచి విద్య, వైజ్ఞానిక మహాసభలు
కడ్తాల్/కందుకూరు: టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆరవ విద్య, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కడ్తాల్, కందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గోపాల్‌నాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ మహాసభలను రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభల్లో ప్రభుత్వ విద్యారంగంపై మేధావులతో లోతైన చర్చ, ఉపాధ్యాయుల అభ్యున్నతికి సూచనలు సలహాలు అందిస్తారని చెప్పారు. ఈ మహాసభలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కడ్తాల్, కందుకూరు మండల అధ్యక్షులు జంగయ్య, రవి, కందుకూరు మండల ప్రధానకార్యదర్శి డాక్టర్ జె.బుగ్గరాములు, సంఘం నాయకులు కౌసల్య, మల్లయ్య, భాగ్యలక్ష్మి, జనార్ధన్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సునీత, శ్వేత, ఈశ్వర్, బక్యానాయక్, జైపాల్, శ్రీనివాస్‌రావు, స్టాన్లీ, కడ్తాల్ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం అంజయ్య, కవిత, గోవర్ధన్‌రెడ్డి, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.
● టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment