ప్రజావాణికి 92 అర్జీలు
● ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ సి.నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యా దులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు 57, పీడీ హౌసింగ్ 19, డీపీఓ ఏడు, లోకల్‌బాడీ మూడు, ఎంపీడీఓ ఒకటి, శేరిలింగపల్లి మున్సిపాలిటీకి ఒకటి, ఏడీ సర్వే ల్యాండ్ రెండు, ఎంప్లాయిమెంట్, వైద్యారోగ్య శాఖకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఎల్మినేడు భూ బాధితులకు న్యాయం
ఎల్మినేడులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ కా ర్యాలయంలో రైతులతో సమావేశమై వివరా లు సేకరించారు. భూ ముల లెక్కలు తప్పుగా చూపారని ప్రతీ గుంటకు పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. స్పందించిన కలెక్టర్ 2013 భూ సేకరణ చట్టంప్రకారం పరిహారం పాటు ఎకరాకు 200గజా ల ప్లాటు ఇస్తామన్నారు. భూములు తక్కువ గా వచ్చిన రైతులకు సంబంధించిన భూములను మరోసారి సర్వే చేసి పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామన్నారు. భూ బాధితుల సంఘం నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ జి ల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, రవి, మహేందర్, శ్రీశైలం, జంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment