మహిళా సమాఖ్య పనితీరు భేష్
నందిగామ: మహిళలు స్వయం ఉపాధితో పాటు సొంత వ్యాపారాలతో ఆర్థికంగా బలపడాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని చేగూరు, అంతిరెడ్డిగూడ గ్రామాలలో మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంబ్రాయిడరి, డెయిరీ పార్లర్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవనోపాధి పొందాలని సూచించారు. కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మహిళ సమాఖ్య పని తీరుకు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీలత, డీపీఎం బాల్‌రాజ్, ఏపీఎం యాదగిరి, మాజీ ఎంపీటీసీ కుమార్ గౌడ్, సీసీలు అరుణ, రజని, సమాఖ్య సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్
Comments
Please login to add a commentAdd a comment