వ్యవసాయానికి రైతే వెన్నెముక
● సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్
షాబాద్: వ్యవసాయ రంగానికి రైతే వెన్నుముక అని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో భారతీయ నూనె గింజల సంస్థ రాజేంద్రగనర్, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం భవిష్యత్ అభివృద్ధిపై వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాలన్నారు. నూనె గింజల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై, కూరగాయలు, వరి సాగు, పాడి పరిశ్రమపై రైతులకు వ్యవసాయ రంగంలో అత్యున్నత సేవలు అందిస్తున్న రైతులను గుర్తించి వారి కృషిని ప్రోత్సహించాలన్నారు. సుస్థిర వ్యవసాయం, సాంకేతిక పద్ధతుల ప్రాముఖ్యత, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ నూనె గింజల సంస్థ టెక్నీషియన్ నందీశ్వర్, మధుసూదన్‌రెడ్డి, చంద్రారెడ్డి, మాధవరెడ్డి, నరసింహారెడ్డి, మల్లారెడ్డి, మల్లయ్య, బొబ్బిగామం, తిర్మలాపూర్ గ్రామల రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment