రైతు సేవలను నిర్లక్ష్యం చేయొద్దు
కుల్కచర్ల: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్యయ్య అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం, ది హైదరాబాద్ సహకార బ్యాంక్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకూడదన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. అవసరమైన వారికి కొత్త రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.
రామలింగేశ్వరస్వామికి పూజలు
బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉందని, ప్రతీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకకు హాజరు కావాలని కోరారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ బక్కారెడ్డి, అర్చకులు పాండుశర్మ, సహకార సంఘ సిబ్బంది, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.
అవసరమైన వారికి కొత్త రుణాలు మంజూరు చేయండి
ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్యయ్య
Comments
Please login to add a commentAdd a comment