శత వసంతోత్సవాలను జయప్రదం చేయాలి
మహేశ్వరం: సీపీఐ వంద వసంతాల ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం మహేశ్వరంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల ఉద్యమ పార్టీగా సీపీఐ ఖ్యాతి పొందిందన్నారు. పేద ప్రజలు, రైతులు, కార్మికుల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసి అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి, వారి సమస్యలు పరిష్కరించిందన్నారు. స్వాతంత్య్ర, కార్మిక ఉద్యమాల్లో సీపీఐ చురుగ్గా పని చేసిందని తెలిపారు. పీడిత వర్గాల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఘనత పార్టీకి ఉందన్నారు. సీపీఐ వందేళ్ల వేడుకల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బి.దత్తునాయక్, మండల కార్యదర్శి పల్లాటి యాదయ్య, నాయకులు దేవేందర్, రమేశ్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment