పంటల సాగులో మెలకువలు అవసరం
కొత్తూరు: పంటల సాగులో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే లాభాలు ఆర్జించవచ్చునని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్ నరేందర్‌రెడ్డి అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా వారు దత్తత తీసుకున్న మల్లాపూర్‌లో సోమవారం రైతులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. పంటల్లో చీడపీడల నియంత్రణకు రసాయన మందులను వాడొద్దని సూచించారు. దీంతో భూ సారం కోల్పోవడంతో పాటు రైతులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. సేంద్రియ ఎరువులతో చీడపీడలను నియంత్రించవచ్చన్నారు. పంటల సాగుకు ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు లావణ్య, ప్రద్మశ్రీ, ప్రమీల, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment