నగరంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బుధవారం తెల్లవారుజామున నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగలంతా ఆకాశం మబ్బులు కమ్మేసి మేఘావృతమైంది. సూరీడు కారుమబ్బుల చాటుకు పరిమితమయ్యాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి. గరిష్టంగా 28, కనిష్టంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట చలిలో మంచుతో పాటు చిరుజల్లులు కురిశాయి. డిసెంబర్ నెలాఖరుకు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ.. ఒకేసారి వాతావరణ మార్పుతో కొంత ఆహ్లాదకరంగా కనిపించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. చిరు జల్లులతో వాహనాల వేగం తగ్గడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment