దూరదృష్టి కలిగిన నేత.. వాజ్‌పేయి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
శంకర్‌పల్లి: దూరదృష్టి కలిగిన అతికొద్ది మంది నేతల్లో అగ్రగణ్యుడు అటల్ బిహారి వాజ్‌పేయి అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శంకర్‌పల్లి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వాజ్‌పేయి దూరదృష్టి కారణంగానే భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేకేఎస్.రత్నం, మండల అధ్యక్షుడు రాములు, మున్సిపల్ అధ్యక్షుడు సురేశ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, వాసుదేవ్‌కన్నా, వెంకటేశ్, బయన్న, నర్సింహారెడ్డి, వీరేందర్, ప్రవీణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పలుచర్చిలకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment