తగ్గేదేలే..!
సిటీ శివారులో న్యూ ఇయర్ పార్టీలకు ఏర్పాట్లు
● బుక్కింగ్ పూర్తయిన ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లు ● ఈవెంట్ల నిర్వహణకుమూడు దరఖాస్తులే ● అనుమతి లేకుంటే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
మొయినాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించేందుకు నగర శివారుల్లోని ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి వేడుకలు, ఈవెంట్స్ నిర్వహించినా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
లిక్కర్‌కు ఎకై ్సజ్.. డీజేకు పోలీసుల అనుమతి
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో వందల సంఖ్యలో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు ఉన్నా యి. వీటిలో కొన్ని వీఐపీలు, రాజకీయ, సినీ, వ్యా పార రంగాలకు చెందిన ప్రముఖులవి ఉన్నాయి. మరి కొన్ని ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లను ఈవెంట్లు, వేడుకలు నిర్వహించేందుకు అద్దెకు ఇస్తున్నారు. వీఐపీలు, ప్రముఖుల ఫాంహౌస్‌లలో వారి కుటుంబ సభ్యులే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునే అవకాశం ఉంది. అద్దెకు ఇచ్చే ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలు, ఈవెంట్స్‌ను నిర్వాహకులు చేపట్టనున్నారు. వాటికి తప్పనిసరిగా పోలీసులు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకల్లో లిక్కర్ వాడితే ఎకై ్సజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. డీజే వాడితే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలు బేఖాతరు
చాలా వరకు ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌ల్లో నిర్వహించే ఈవెంట్స్, వేడుకలకు అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పడప్పడు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లపై దాడులు చేసి అనుమతి లేకుండా నిర్వహించే ఈవెంట్లు, వేడుకలను భగ్నం చేస్తున్నారు. అయినా ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌ల నిర్వాహకులు భయపడటంలేదు. మామూళ్లకు అలవాటు పడిన పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
అనుమతులు తప్పనిసరి
న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే రిసార్ట్స్, ఫాంహౌస్‌లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ముందే చెప్పాం. ఇప్పటి వరకు మూడు రిసార్ట్స్ యజమానులు ఈవెంట్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఫాంహౌస్‌ల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అనుమతి లేకుండా వేడుకలు, ఈవెంట్స్ నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– పవన్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, మొయినాబాద్
డిసెంబర్ 31న రాత్రి నిర్వహించే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఫాంహౌస్ నిర్వహకుడు కూడా అనుమతి తీసుకోలేదు. వేడుకలకు ఐదు రోజుల సమయమే ఉన్నా ఇప్పటి వరకు అనుమతులకోసం దరఖాస్తులు చేయడంలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహస్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు 600 ఫాంహౌస్‌లను వేడుకలు, ఈవెంట్లకు అద్దెకు ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకోసం ఈ ఫాంహౌస్‌లు అన్ని బుక్ అయినా పోలీసుల అనుమతి తీసుకోకపోవడం గమనార్హం.
బుకింగ్‌లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment