ముఖ్యమంత్రికిక్రిస్మస్ శుభాకాంక్షలు
ఆమనగల్లు: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
డాలర్స్ హిల్స్‌లో కొండచిలువ కలకలం
మణికొండ: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ప్రహరీలోకి కొండ చిలువ రావటంతో కార్మికులు భయాంకు గురయ్యారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్స్‌హిల్స్ కాలనీలో డాక్టర్ అవినాష్ నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 అడుగుల కొండ చిలువ ప్రహరీ గోడ లోపలికి వచ్చింది. ఓ మూలన ఉన్న డస్ట్ బిన్ పక్కన చేరి బుసలు కొట్టింది. అటుగా వెళ్లిన వారు దాన్ని గమనించి యజమానికి తెలిపారు. దీంతో ఆయన స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సంచిలో దానిని బంధించారు. కొండచిలువను జూపార్క్‌లో అప్పగిస్తామని తెలిపారు.
అందాల భవనానికి
అరుదైన గౌరవం!
ఓయూ ఆర్ట్స్ కాలేజీకి
ట్రేడ్‌మార్క్ గుర్తింపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కాలేజీ భవనానికి అరుదైన గౌర వం దక్కింది. నిజాం హయాంలో 1939లో నిర్మితమైన భవనానికి ప్రతిష్టాత్మక భారత ప్రభుత్వ ట్రేడ్ మార్క్ గుర్తింపు లభించింది. ట్రేడ్‌మార్క్ నింబంధనల ప్రకారం ఆర్ట్స్ కాలే జీ భవనం ఫొటోను ఇతరులు ఉపయోగించకూడదు. ఇక నుంచి ఈ భవనం ఫొటోను ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, విద్యా సంస్థలు, కాలేజీలు, వ్యాపార సంస్థలతో పాటు క్రీడాకారుల బహుమతులు, వివిధ రకాల వస్తువులు, గృహాలంకరణ గిఫ్ట్‌లు, టీ కప్పులు, వాల్‌పోస్ట ర్లు, క్యాలెండర్లు, డైరీలు తదితరాలపై ముద్రించకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులపై చట్టపరంగా చర్యలు ఉంటా యని అధికారులు తెలిపారు. ట్రేడ్ మార్క్ ఉన్న భవనాలు మన దేశంలో రెండే ఉన్నాయి. ముంబైలోని తాజ్‌మహల్ హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలు కాగా.. ఇప్పుడు ఈ జాబితాలో ఆర్ట్స్ కాలేజీ చేరింది.
ప్రతిష్టను పెంచేందుకు..
మారిన పరిస్థితులకు అనుకూలంగా ఆర్ట్స్ కాలే జీ భవన ప్రతిష్టను పెంచేందుకు ట్రేడ్ మార్క్ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో జాతీయ స్థాయి మేధోసంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో దరఖాస్తు చేయగా భారత ప్రభుత్వ గెజిట్ ఈ నెల 2న ప్రచురితమైందని ఓయూ న్యాయ క ళాశాల సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి చెప్పారు. జనవరి 15 వరకు ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ చైన్నె కార్యాలయం నుంచి జారీ కానున్నట్లు ఆయన తెలిపారు. సర్టిఫికెట్ జారీ అయిన వెంటనే ఓయూ వీసీ ప్రొ.కుమార్ అధికారికంగా ప్రకటించనున్నట్లు జీబీ రెడ్డి చెప్పారు.
అభివృద్ధి పనులకు
శంకుస్థాపన నేడు
కొడంగల్: నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. జిల్లా అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కొడంగల్‌లో బీసీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులకు భూమి పూజ, ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయానికి శంకుస్థాపన, దుద్యాల్ పీఎస్ ప్రారంభం, హకీంపేటలో జూనియర్ కళాశాల, హైస్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment