పాడి పరిశ్రమాభివృద్ధికి కృషి
కడ్తాల్: పాడి పరిశ్రామిభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని గురువారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పాల సేకరణ వివరాలను మెనేజర్ రాధికను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా సమాఖ్య పనిచేస్తుందని పేర్కొన్నారు. స్థానిక విజయ డెయిరీ పరిధిలో పాడి రైతులకు సకాలంలో పాలబిల్లులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని డీసీీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, పాడి రైతు సంఘం నాయకుడు కడారి రామకృష్ణ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పాడిరైతుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అఽధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కడ్తాల్ విజయ సొసైటీ అధ్యక్షుడు చేగూరి వెంకటేశ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
● టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment