ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
కవాడిగూడ: సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఉపాధ్యాయినులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఉపాధ్యాయినులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో చేపట్నిన ధర్నాకు ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా, పరిరక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారా యణ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఎంవీఎఫ్ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి, సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment