నాంపల్లి: రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన నాంపల్లి జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చందానగర్–లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..సుమారు 25 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తు తెలియని యువకుడు చందానగర్–లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వచ్చిన ఓ రైలు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment