శనివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
10లోu
సమావేశానికి హాజరైన విద్యార్థులు
సభ సైడ్‌లైట్స్
● సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 4.40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మొగిలిగిద్దకు వచ్చారు.
● స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
● సాయంత్రం 4.45 నిమిషాలకు హెలిపాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
● 5గంటలకు పాఠశాల ఆవరణలో సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు.
● అనంతరం అరగంట పాటు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
● 5.30 గంటలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి పాఠశాల నుంచి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
● 5.40నుంచి 6గంటల వరకు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు.
● 6.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.
షాద్‌నగర్: మండల పరిధిలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పూర్వ విద్యార్థి, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలకరించారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ మహేదందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటో ఎగ్జిబిషన్
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యాశాఖ అధికారులు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. స్కూల్, గ్రామ చరిత్ర, నాటి నవాబుల పాలనకు సంబంధించిన ఫొటోలను ఇందులో ప్రదర్శించారు. స్కూల్‌కు సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. పాఠశాల పూర్వ విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. బహిరంగ సభకు వెళ్లే ముందు అందరితో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎంను శాలువాతో సన్మానించారు.
భారీగా నిధులు మంజూరు
మొగిలిగిద్దకు సీఎం వరాల జల్లు కురిపించారు. అత్యాధునిక వసతులతో పాఠశాల నూతన భవనానికి రూ.10 కోట్లు, గ్రంథాలయ నిర్మాణం కోసం కోటి రూపాయలు, గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాల రూపకల్పకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అడ్వాన్స్‌డ్ సెంటర్‌తో పాటు ఎమ్మెల్యే శంకర్ కోరిక మేరకు గ్రామంలో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు చేపట్టారు. పాఠశాల, బహిరంగ సభ ప్రాంగణంలోకి వెళ్లే వారితో పాటు సభావేదికను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తరలివచ్చిన జనం
సీఎం బహిరంగ సభకు వివిధ గ్రామాల నుంచి జనం భారగా తరలివచ్చారు. సుమారు పదివేల మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. హెలిపాడ్ నుంచి బహిరంగ సభకు వచ్చే దారిలో, పరిగి రోడ్డు గుండా పార్టీ నాయకులు, కార్యకర్తల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కేరింతలు కొట్టారు.
న్యూస్‌రీల్
భవిష్యత్తుకు పునాదులు
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇది గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీఠ వేశారన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. షాద్‌నగర్‌కు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment