సాక్షి, సిటీబ్యూరో: గుండెపోటు బారిన పడినవారికి సంజీవని లాంటి సీపీఆర్ విధానంపై నగర కమిషనరేట్‌లో పని చేస్తున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ట్రాఫిక్ సహా వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1,409 మందికి ఇప్పటికే పూర్తి కాగా.. మరో 1,248 మందికి శిక్షణ ఇవ్వడానికి మెహిదీప ట్నంలోని మైత్రీ హాస్పిటల్స్ ముందుకు వచ్చింది. గురువారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో కమిష నర్ సీవీ ఆనంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 15 బ్యాచ్‌లుగా శిక్షణ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇది కేవలం ప్రజలకే కాకుండా పోలీసు కుటుంబాలకూ పనికి వచ్చే అంశమని అన్నారు. ఓ సర్వే ప్రకారం దేశంలో 98 శాతం మందికి సీపీఆర్ విధానంపై అవగాహన లేదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఇది చాలా అవసరమని ఆనంద్ వ్యాఖ్యానించారు. అమెరికా, జపాన్, సింగపూర్‌తో పాటు యూరోపియన్ దేశాలు తమ విద్యావిధానంలో సీపీఆర్‌ను బోధించడం తప్పనిసరి చేశాయని, దీనిపై అవగాహన లేని కారణంగానే ఇక్కడ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment