నాబార్డ్ కరదీపిక ఆవిష్కరణ
సాధ్యంకాని హామీలతో.. సాధ్యంకాని హామీలతో అధికారం చేపట్టి, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు.
8లోu
ఇబ్రహీంపట్నం రూరల్: నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్‌ప్లాన్ 2025–26 కరదీపికను గురువారం కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆవిష్కరించారు. నాబార్డ్ ప్రతి జిల్లాకు ప్రతి సంవత్సరం పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ని సిద్ధం చేస్తుంది. ప్రాధాన్యత విభాగంలో జిల్లాలో అందుబాటులో ఉన్న భౌతిక, ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని లీడ్ బ్యాంక్ జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేయడానికి వార్షిక జిల్లా క్రెడిట్ ప్లాన్‌ని సిద్ధం చేసింది. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రూ.4,633.34 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్‌లోన్ రూ.2,107.22 కోట్లు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం రూ.803.19 కోట్లు, అనుబంధ కార్యకలాపాల కోసం రూ.2,464.30 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు ఎంస్‌ఎంఈ కోసం రూ.20,342.65 కోట్లు సహా జిల్లా మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ.32,062.17 కోట్లుగా నాబార్డ్ ఆర్థిక అంచనా వేసింది. కార్యక్రమంలో డీడీఎం పి.హర్ష రఘురామ్, ఎల్‌డీఎం యాదగిరి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment