ఉత్తమ పనితీరుకు గుర్తింపు
నగర కమిషనరేట్‌లో 706 మందికి రివార్డులు
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తమ పనితీరును కనబర్చిన నగర పోలీసు అధికారులకు కొత్వాల్ సీవీ ఆనంద్ రివార్డులు అందించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (టీజీ ఐసీసీసీ) జరిగిన కార్యక్రమంలో 706 మంది అధికారులు, సిబ్బందికి వీటిని అందించారు. వీరిలో ఆరుగురు అదనపు డీసీపీలు, 13 మంది ఏసీపీలు, 73 మంది ఇన్‌స్పెక్టర్లు, 83 మంది ఎస్సైలు, 12 మంది ఏఎస్సైలు, 86 మంది హెడ్–కానిస్టేబుళ్లు, 334 మంది కానిస్టేబుళ్లు, 29 మంది హోంగార్డులతో పాటు 64 మంది మినిస్టీరియల్ సిబ్బంది, ఆరుగురు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. ఉత్తమ దర్యాప్తు బృందంగా సీసీఎస్‌లో పని చేసే ఏసీవీ వై హరీష్ కుమార్, టీమ్–1 ఇన్‌స్పెక్టర్ డి.రాంబాబు, ఎస్సైలు ఎస్.రవికుమార్, బి.జయంత్‌లు కమీషనర్ ట్రోఫీ గెల్చుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ కె.మధుసూదన్ రావు, ఎస్సైలు కె.వెంకటేష్, సీహెచ్ మహిపాల్, ఎ.మాధవిలకు ఈ ట్రోఫీ లభించింది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషిని సీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment