గ్రీన్‌ఫీల్డ్ సర్వేను అడ్డుకున్న గిరిజనులు
ఆమనగల్లు: ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్‌సిటీ మీదుగా ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు సర్వేను ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండతండాలో గిరిజనులు మరోసారి అడ్డుకున్నారు. సర్వేను ఈనెల 9న ఆమనగల్లు మండలంలో నిర్వహించిన సమయంలో గిరిజన రైతులు అడ్డుకున్నారు. రెండురోజులుగా ఆమనగల్లు తహసీల్దర్ కార్యాలయంలో సాకిబండతండా గిరిజనులతో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండతండా సమీపంలో గురువారం సిబ్బంది మరోసారి సర్వే నిర్వహించేందుకు సిద్ధం కాగా గిరిజనులు అడ్డుకున్నారు. కందుకురు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, వారితో మాట్లాడారు. తమ భూ సమస్యలు పరిష్కరించి, ఎకరాకు రూ.2కోట్ల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఫోర్త్‌సిటీలో వందగజాల ఇంటిస్థలం ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. రోడ్డు సర్వే పనులను అడ్డుకోవడంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment