నిధుల దుర్వినియోగం లేకుండా ఆడిటింగ్
మొయినాబాద్‌రూరల్: ప్రభుత్వ పరంగా పంచాయతీల నిర్వహణ, ఖర్చు పెట్టిన డబ్బులను అధికారులు దుర్వినియోగం చేయకుండా ఆడిటింగ్ చేయడం జరుగుతుందని జిల్లా ఆడిటింగ్ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్, ఎన్కెపల్లి గ్రామాల్లో అధికారులు గురువారం ఆడిటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి గ్రామాల్లో ఖర్చు పెట్టిన పరిపాలనకు సంబంధించిన ఖర్చులను, ఆన్‌లైన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. 2024 సంవత్సరానికి సంబంధించి పంచాయతీ పాలనలో ఖర్చు చేసిన నిధులు, వాటి బిల్లులను పరిశీలించి ఆడిటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరిగినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హిమాయత్‌నగర్ పంచాయతీ అఽధికారి సంధ్యారాణి, ఎన్కెపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆడిటింగ్ అధికారి విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment