‘కన్హా’లో ఐపీఎస్ అధికారుల బృందం
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వనాన్ని ఐపీఎస్‌ల బృందం గురువారం సందర్శించింది. నాలుగు రోజుల డీప్ యు ఇండియా రిట్రీట్ కార్యక్రమంలో భాగంగా హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రఖ్యాత వక్త వాస్కో గ్యాస్పర్ ఆధ్వర్యంలో 40 మందికిపైగా ఐపీఎస్ అధికారుల బృందం ప్రత్యేకంగా సందర్శించి, ధ్యానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వీయ ఆవిష్కరణ, స్వస్థత, జీవితంలో లక్ష్యాన్ని కనుగొనడం, పరివర్తనలో మార్పు తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ సందర్భంగా వాస్కో గ్యాస్పర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటామని, ఒత్తిడిని తట్టుకొని ఏకగ్రత పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ధ్యానం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment