రసాభాసగా వార్డు సభ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో మంగళవారం నిర్వహించిన వార్డు సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక జాబితా మొత్తం ఏకపక్షంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులకు కాకుండా అనర్హులకే పథకాలు ఎక్కువగా అందేలా ఉన్నాయని మండిపడ్డారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అనుకూలంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో కొత్త ఆర్తిక, కౌన్సిలర్లు గోపగల్ల మహేందర్, వనం శ్రీనివాస్, దాసుగౌడ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment