అభివృద్ధి పనులు చేపట్టండి
అదుపుతప్పిన ఆటో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
8లోu
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామానికి ఈ నెల 31 సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిపై ప్రొఫెసర్ హరగోపాల్, గ్రామ పెద్దలతో కలిసి కలెక్టర్‌తో చర్చించారు. గ్రామంలో చరిత్ర కలిగిన ఉన్నత పాఠశాలకు నూతన భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, ఆటస్థలం, ఆర్వో ప్లాంటు, ప్లే గ్రౌండ్‌వంటి వసతులు కల్పించాలని కోరారు. ఇంగ్లిష్, ఉర్దూ మీడియం పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు బాలుర, బాలికలకోసం విడిగా వసతి గృహాల నిర్మాణం, అంగన్‌వాడీ భవనం, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం, పంచాయతీ కార్యాలయ భవనం, మినీస్టేడియం, గిద్దకట్ట చెరువువద్ద మినీ ట్యాంక్‌బండ్, అంతర్గ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాలని సూచించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.80కోట్ల నిధులతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో గ్రామపెద్దలు శ్యాంసుందర్, మల్లేష్, సత్యనారాయణరెడ్డి, శ్రీశైలం, కార్తీక్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌తో ఎమ్మెల్యే వీర్లపల్లి, మొగిలిగిద్ద పెద్దల చర్చలు
Comments
Please login to add a commentAdd a comment