దశలవారీగా పథకాల అమలు
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులందరికీ దశల వారీగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది రేవంత్‌రెడ్డి సర్కార్ అని చెప్పారు. అర్హులకు పథకాలు అందకపోతే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎంత మందికి రుణమాఫీ అమలైందని ఏడీఏ సూజాతను అడగ్గా సరైన సమాచారం చెప్పలేదు. దీంతో వివరాలు లేకుండా సభకు ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన అవగాహనతో సమావేశాలకు రావాలన్నారు. కార్యక్రమం జరుగుతుండగానే కొంత మంది గ్రామస్తులు ఆదిబట్లలో 40 ఫీట్ల రోడ్డు వేయొద్దని, దీంతో తమ ఇళ్లు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత చైర్మన్ నిరంజన్‌రెడ్డిని నిలదీశారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా రోడ్లు వేయాల్సి ఉంటుందని ఆయన నచ్చజెప్పారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ లావణ్య, కమిషనర్ బాలకృష్ణ, కోఆప్షన్ సభ్యులు గోపాల్‌గౌడ్, ఉప్పరిగూడ పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment