అర్హులందరికీ సంక్షేమ పథకాలు
చేవెళ్ల: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ తెలిపారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాతీయ వద్ద మంగళవారం ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ హిమబిందు అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ అత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అధికారులవద్ద ఉన్న సమాచారంతో తాత్కాలిక జాబితాలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ జాబితాలను ఇప్పటికే పంచాయతీల వద్ద ప్రదర్శించడం జరిగిందని, గ్రామ సభల్లో ఆ పేర్లను చదివి వినిపించినట్లు చెప్పారు. జాబితాలో ఉన్న పేర్లలో ఏమైనా అభ్యంతరాలున్నా, జాబితాలో పేర్లు రాని అర్హులైన వారు గ్రామంలో ఉన్నా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, నియోజకవర్గం నాయకులు ఎస్.వసంతం, మాజీ ఉప సర్పంచ్ గంగి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్
Comments
Please login to add a commentAdd a comment