ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీదే
మహేశ్వరం: భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారంలో కుండె వెంకటేశ్ ఫామ్ హౌస్‌లో మంగళవారం సాయంత్రం బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాజ్యంగం చేతబట్టి బీఆర్ అంబేడ్కర్ వారసులమని చెప్పుకొనే పార్టీలను ప్రజలు విశ్వసించరని అన్నారు. సొంత ఇంటి వారికే భారతరత్న బిరుదులు ఇచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించారు. వాజ్‌పేయ్ ప్రధాని అయ్యేంతవరకు పార్లమెంట్‌లో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్ట లేదని గుర్తు చేశారు. అంబేడ్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలను పాటిస్తుంది బీజేపీ మాత్రమే అని తెలిపారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్ గౌడ్, ప్రేమ్ రాజ్, బస్వ పాపయ్య గౌడ్, బోసుపల్లి ప్రతాప్, దేశ్యా నాయక్, కుండె వెంకటేశ్, జిల్లా కార్యదర్శి అయిల్ల యాదయ్య గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మాధవాచారి, మండల అధ్యక్షుడు యాదిష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌ను అవమానించింది వారే
ఆయన సిద్ధాంతాలు పాటిస్తోంది బీజేపీ మాత్రమే
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment