నాలుగేళ్ల బాలికను బలిగొన్న డ్రైవర్ నిర్లక్ష్యం
హయత్‌నగర్: ప్రతిరోజూ తనను పాఠశాల నుంచి తీసుకొచ్చే వాహనమే ఆ చిన్నారి పాలిట మృత్యు శకటంగా మారింది. పాఠశాల నుంచి వచ్చి ఇంటి వద్ద దిగి వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బాలిక వ్యాన్ టైరు కిందపడి మృతి చెందిన ఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ హనుమాన్ హిల్స్‌లో నివసించే నర్సింహ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె రిత్వి క (4) హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య పాఠశా లలో ఎల్‌కేజీ చదువుతోంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన రిత్విక సాయంత్రం స్కూల్ వ్యాన్‌లో వచ్చి ఇంటి సమీపంలో దిగింది. డ్రైవర్ గణేశ్ నిర్లక్ష్యంగా వ్యాన్‌ను వెనక్కి తీయడంతో రిత్విక వాహనం ముందు చక్రాల కిందపడి నలిగిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంబంధిత వ్యాన్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు తెలి పారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృత దేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల ఎదుట ఆందోళన
విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పాఠశాల గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. విజయవాడ రహదారిపై కొద్దిసేపు వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాత్రి 9 గంటల వరకూ పాఠశాల యాజ మాన్యం అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment