![ధర్మ సంసత్‌లో చిలుకూరు అర్చకుడు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06chv62-640003_mr-1738894276-0.jpg.webp?itok=nwjx9bQF)
ధర్మ సంసత్‌లో చిలుకూరు అర్చకుడు
మొయినాబాద్: మహా కుంభమేళా ధర్మ సంసత్‌లో చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ పాల్గొన్నారు. కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించిన ఆయన గురువారం ఉత్తరాణ్మాయా జ్యోతిష్పీఠం శంకర మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ నిర్వహించిన ధర్మ సంసత్‌లో చిలుకూరు ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం ధర్మ పరిరక్షణకోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రామరాజ్య స్థాపన కోసం చిలుకూరు నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ అర్చ కుడు రంగరాజన్‌కు జ్ఞాపికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment