![చిప్స్ తింటూ చిన్నారి మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06chv65-640003_mr-1738894275-0.jpg.webp?itok=a-FqwY7g)
చిప్స్ తింటూ చిన్నారి మృతి
మొయినాబాద్: చిప్స్ తింటుండగా శ్వాసనాళంలో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రజ్మీర్, రోసళి దంపతులు తమ రెండేళ్ల కూతురుతో కలిసి ఆరు నెలల క్రితం మొయినాబాద్‌కు వలస వచ్చారు. తోల్‌కట్ట సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భార్యాభర్తలు భోజనం చేస్తూ చిన్నారికి చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు. ఇది తింటూ పాప ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే తట్టి లేపే ప్రయత్నం చేయగా, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుంది. హుటాహుటిన స్థానిక భాస్కర ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు పాప మృతిచెందినట్లు నిర్ధారించారు. చిన్నారికి ఏం తినిపించారని డాక్టర్లు అడగగా.. చిప్స్ ఇచ్చామని చెప్పారు. చిప్స్ తింటుండగా అది శ్వాస నాళంలో చిక్కుకుని మృతిచెందిందని వైద్యులు తెలిపారు. చిన్న పిల్లలకు ఇలాంటి ఆహార పదార్థాలు తినిపించవద్దని సూచించారు. బతుకు దెరువుకోసం వచ్చి న వలస కుటుంబంలో పాప మృతి తీరని విషాదం నింపింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అంద లేదని పోలీసులు తెలిపారు.
● శ్వాసనాళంలో ఇరుక్కోవడంతో రెండేళ్ల పాప దుర్మరణం
● వలస కుటుంబంలో తీరని విషాదం
Comments
Please login to add a commentAdd a comment