బీదర్‌లో బీజేపీ హవా | - | Sakshi
Sakshi News home page

బీదర్‌లో బీజేపీ హవా

Published Sun, May 14 2023 4:36 AM | Last Updated on Sun, May 14 2023 4:36 AM

- - Sakshi

నాలుగు స్థానాలలో విజయం

రెండు స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌

రెండు సిట్టింగ్‌ స్థానాలలోబీజేపీ విజయం

కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచిచెరొక స్థానం బీజేపీ కై వసం

బాల్కీలో ఈశ్వర్‌ ఖండ్రె

వరుసగా విజయం

జహీరాబాద్‌: జహీరాబాద్‌కు పక్కనే ఉన్న కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించింది. శనివారం బీదర్‌ జిల్లాకు సంబంధించిన ఆరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు భూంరెడ్డి కళాశాలలో నిర్వహించారు. ఇందులో నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్‌ రెండు స్థానాలలో గెలుపొందింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

● బీదర్‌ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం కనిపించలేదు. ఔరాద్‌ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భీంశంకర్‌ రావు షిండే పై 9,348 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● బస్వకళ్యాణ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శరణు సల్గార తిరిగి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ్‌ సింగ్‌ పై 14,264 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● బీదర్‌ దక్షిణ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్దాలె కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌ ఖేణిపై 1,160 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఇక్కడ జేడీఎస్‌ తరపున పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండెప్ప కాశీంపూర్‌ మూడో స్థానంతోసరిపెట్టుకున్నాడు.

● హుమ్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సిద్దు పాటిల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌ పాటిల్‌ పై 1,460 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● బాల్కీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఈశ్వర్‌ ఖండ్రె వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి ప్రకాష్‌ ఖండ్రైపె 27,438 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

● బీదర్‌ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసిన రహీం ఖాన్‌ జేడీఎస్‌ అభ్యర్థి సూర్యకాంత్‌ నాగమర్పల్లిపై 10,659 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement