ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఎస్సీ కార్పోరేషన్ రుణాలు మంజూరు చేయడంతోపాటు కొత్త రుణాల కోసం షెడ్యూల్ ప్రకటించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో జరిగిన కేవీపీఎస్ కార్యకర్తల సమావేశం అశోక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారని, అవి ఇప్పటివరకు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం దళితబంధు అమలు చేస్తున్నామని చెప్పి కార్పొరేషన్ రుణాల లబ్ధిదారులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా అంబేడ్కర్ అభయహస్తం పేరుతో దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.12లక్షలు ఇస్తామని చెప్పిందని కానీ ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు న్యాయవాది సుభాష్, ఎం.శివ కుమార్, జిల్లా కమిటీ బి.దత్తు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment