చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే చింతా
సదాశివపేట (సంగారెడ్డి): ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీలోభాగంగా పట్టణంలోని ఊబచెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మత్య్సశాఖ అధికారులు, మత్స్య సహకార సంఘం సభ్యులతో కలసి 27,977 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు ఆకుల శివకుమార్, సతాని శ్రీశైలం, మత్స్యశాఖ ఏడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై
అవగాహన కల్పించాలి
డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి
ఝరాసంగం(జహీరాబాద్): సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగం పోలీస్ స్టేషన్‌ను ఆయన శనివారం తనిఖీ చేసి పీఎస్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని అనవసర లింకులు ఓపెన్ చేయరాదని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంతు, ఎస్‌ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
పటాన్‌చెరు టౌన్: ప్రియంకాగాంధీ వయ్‌నాడు పార్లమెంట్ ఉపఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం సాయంత్రం స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
చిన్న గుడ్లను వెనక్కి పంపండి
జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి
జోగిపేట(అందోల్): అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్లు చిన్న సైజులో ఉంటే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు తీసుకోవద్దని జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి సూచించారు. అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. లలితా కుమారి వెంట సీడీపీవో ప్రియాంక, సూపర్‌వైజర్ రాజేశ్వరి ఉన్నారు.
గ్రామీణాభివృద్ధే కేంద్రం లక్ష్యం
పటాన్‌చెరుటౌన్: దేశంలో నేటికీ క్షేత్రస్థాయిలో 70% గ్రామీణ వాతావరణమే కనిపిస్తుందని గ్రామీ ణ ప్రాంతాల పురోగతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అఖిల భారత సర్వీసుల్లోని సభ్యుల బృందం ప్రతినిధి వసంత్ కుమార్ పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో ఐదు రోజులపాటు ఈ బృందం పర్యటించనుంది. గ్రామంలోని హెల్త్, అంగన్‌వాడి ఐసీడీఎస్, ఆశ, డ్వాక్రా మహిళలతో బృందంలోని సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానం తెలుసుకునేలా సంగారెడ్డి జిల్లాలో నందిగామ, కొడకంచి, శివంపేట్, మల్లేపల్లి, వెల్టూర్‌లో ఆరు బృందాలు ఐదు రోజులపాటు గ్రామాల్లో, రెండు రోజులపాటు మున్సిపాలిటీలలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో చేతన్ కుమార్ బీవీ.స్వాతి సందీప్, పల్వే వికాస్ బాల సాహెబ్, స్వాతి గుప్తా,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment