మనం మేలుకోక ముందే వాళ్లు పని మొదలు పెడుతారు. మన ఊరిని.. వీధిని.. మన కోసం శుభ్రం చేస్తారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా.. బతుకులో మార్పురాని నిరుపేదలు వాళ్లు.. చీపురు పట్టి ఊడ్చి ఊడ్చి వెన్ను నొప్పితో బాధపడే శ్రామికులే పారిశుద్ధ్య కార్మికులు. అత్తెసరు వేతనం.. అందులోనూ కోత. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజ్‌లు, సబ్బులు, నూనెలు, బూట్లు ఎప్పుడోగాని ఇవ్వరు. అయినా చలికి వణుకుతూ విధులు నిర్వహించక తప్పని పరిస్థితులు. రక్షణ కరువై విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదాల బారిన పడితే వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారింది. శనివారం తెల్లవారు జామున ‘సాక్షి’పరిశీలనకు వెళ్లగా కార్మికుల దుర్భర స్థితిగతులు కళ్లకు కనిపించాయి.
– దొంతి నరేష్‌గౌడ్, మెదక్ మున్సిపాలిటీ / గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట
8లో
Comments
Please login to add a commentAdd a comment