అర్హులందరూ ఓటరుగా నమోదు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
సంగారెడ్డి/జోగిపేట(అందోల్): అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని, అధికారులు తప్పులు లేని ఓటరు జాబితా లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ...ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా అధికారులు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ పనులు వేగవంతంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు చౌట్కూర్ మండలం శివమ్‌పేటలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సంగారెడ్డి, అందోల్ ఆర్డీవో కార్యాలయాలు తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలసి సమావేశం నిర్వహించారు. స్థానిక బీఎల్‌వోలతో మాట్లాడి ఫారం 6, 7, 8 ఆన్లైన్, సాధారణ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఆర్డీవోలు రవీందర్ రెడ్డి పాండు, తాహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు పరిశీలన
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలసి అందోల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తనిఖీ చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఇప్పటివరకు నమోదైన వివరాలు, ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలను ఆర్డీవో పాండును అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. టేక్మాల్ మండలంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను పెంచిన విషయం అధికారులు వివరించారు. ఇంటింటి సర్వేపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, తహసీల్దారు విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్లు మధుకర్‌రెడ్డి, చంద్రశేఖర్ (ఎన్నికలు)లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment