పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులతో పాటు వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ధరణి పెండింగ్ సమస్యలు, ప్రజావాణి, ఓటరు నమోదు ఎస్‌ఎస్‌ఆర్–2025 తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ధరణి, ప్రజావాణి సమస్యల పరిష్కారం, ఓటరు నమోదు తదితర అంశాలలో రెవెన్యూ యాంత్రాగం ప్రధాన భూమిక పోషించాలన్నారు. ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని మండల తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులు వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు.
చివరిదశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోలు చివరిదశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటుగా రైతుల ఖాతాలో రూ.160 కోట్లను జమ చేసినట్లు తెలిపారు.
11.50 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి !
జిల్లాలో పత్తి 3.48 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిందని, దాదాపు 11.50 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం వుందని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో వసతిగృహాల్లో, పాఠశాలల్లో ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు తహసీల్దార్ ఎంపీడీవోలు విధిగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. తనిఖీల సందర్భంగా విద్యార్థులతో కలసి భోజనం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్‌వో పద్మజారాణి, జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్, డీఏండీసీఎస్ కొండలరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment