పొగాకు అనర్థాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

పొగాకు అనర్థాలపై అవగాహన

Published Sat, Feb 8 2025 10:03 PM | Last Updated on Sat, Feb 8 2025 10:03 PM

పొగాక

పొగాకు అనర్థాలపై అవగాహన

నారాయణఖేడ్‌: జిల్లా పొగాకు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఖేడ్‌ మండలం తుర్కపల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని పీహెచ్‌సీ సిబ్బంది, రోగులు, విద్యార్థులతో జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్‌వైజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి డా.హరిణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాతృత్వానికి

నిలువెత్తు నిదర్శనం

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: అణగారిన వర్గాల భవిష్యత్‌ కోసం తన కన్న పిల్లల్ని పోగొట్టుకొన్న రమాబాయి అంబేడ్కర్‌ మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం పేర్కొన్నారు. రమాబాయి 127వ జయంతి సందర్భంగా కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. రమాబాయి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలతో

అధిక లాభాలు

డీడీ సోమేశ్వర్‌రావు

జహీరాబాద్‌టౌన్‌: ఉద్యాన పంటల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతుందని జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ సోమేశ్వర్‌రావు పేర్కొన్నారు. గోవింద్‌పూర్‌ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటల సాగుపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అయిల్‌పామ్‌, పండ్లు, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలకు కూడా సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలను అందజేస్తుదన్నారు. ఆసక్తిగల రైతులు ముందుకు వస్తే కూరగాయలు, అయిల్‌పామ్‌ సాగుకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హార్టీకల్చర్‌ మండల అధికారి పండరి, అయిల్‌పామ్‌ గోద్రెజ్‌ మేనేజర్‌ కొండల్‌రావు, శాస్త్రవేత్త శైలజ, మామిడి రైతులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేత సెయింట్‌ ఆంథోనీస్‌

సంగారెడ్డి: మహబూబాబాద్‌లో టెన్నీస్‌ బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన అండర్‌–14 రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ విజేతగా విద్యానగర్‌ సెయింట్‌ ఆంథోనీస్‌ క్రికెట్‌ జట్టు నిలిచింది. ఈ మేరకు పాఠశాల చైర్మన్‌ ఆంథోనీరెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రమీల శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బాలురు, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టుతో తలపడి తెలంగాణ జట్టు తరఫున తమ పాఠశాల విద్యార్థులు ట్రోఫీని గెలుచుకున్నారని వివరించారు. విజేతలు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించారు.

ఈ నెల 15ను సాధారణ సెలవు దినంగా ప్రకటించాలి

సంగారెడ్డి: సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిరోజైన ఫిబ్రవరి 15ను రాష్ట్రం ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అశోక్‌ నాయక్‌ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పొగాకు అనర్థాలపై  అవగాహన
1
1/3

పొగాకు అనర్థాలపై అవగాహన

పొగాకు అనర్థాలపై  అవగాహన
2
2/3

పొగాకు అనర్థాలపై అవగాహన

పొగాకు అనర్థాలపై  అవగాహన
3
3/3

పొగాకు అనర్థాలపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement