చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో రైతుల పంటలు ఎండిపోకుండా కాలువలతో చెరువులు నింపాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని ఇబ్రహీంపూర్, బోనాల గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు కాలువల నీరు రాకుంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు గ్రామాల శివారులోని చెరువులకు కాలువల నీటితో నింపాలని చెప్పారు. ఆయనతో పాటు ఎగ్గిడి శేఖర్, లచ్చిరెడ్డి, చాతిరి స్వామి, మల్లయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment