![మెరుగైన వసతులను కల్పించండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ptc21a-350052_mr-1738998856-0.jpg.webp?itok=EiS3a3mm)
మెరుగైన వసతులను కల్పించండి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్‌బెడ్‌రూం కేసీఆర్‌నగర్ కాలనీవాసులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని కలెక్టర్ వల్లూరు కాంత్రి అధికారులను ఆదేశించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డబుల్‌బెడ్ రూం కేసీఆర్ కాలనీను శుక్రవారం ఆమె సందర్శించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఇప్పటివరకు కాలనీలో 7,258 కుటుంబాలకు చెందిన 30వేల మంది జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారన్నారు. వీరికి ప్రాథమిక, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, పోలీస్ అవుట్ పోస్ట్, రేషన్ దుకాణాల ఏర్పాటు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, అందుకు కావాల్సిన ప్రణాళికలను రూపొందించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
కమిషనర్‌కు సెలవు ఎందుకు ఇచ్చారు...?
కేసీఆర్ కాలనీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డితో పలువురు అధికారులు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి కమిషనర్‌కు ఎందుకు సెలవు మంజూరు చేశారని ప్రశ్నించారు. తను సమావేశానికి వస్తున్నానని తెలిసి, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏవిధంగా సెలవు ఇచ్చారని నిలదీశారు. కమిషనర్‌తో పాటు ఇంకా ఎంతమంది సిబ్బంది సెలవుపై వెళ్లారని ఆరాతీశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి, కొల్లూర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
డబుల్‌బెడ్‌రూం కేసీఆర్ కాలనీ సందర్శన
అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment