ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: త్వరలో జరుగనున్న కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మరోసారి తనకు అవకాశం కల్పించాలి ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. సంగారెడ్డిలోని ఎస్టీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నిరంతరం ఉపాధ్యాయుల పక్షాన నిలబడతానని హామీనిచ్చారు. పాఠశాలలతో సంబంధం లేని వ్యక్తులను గెలిపిస్తే ఉపాధ్యాయుల విలువలు దిగజారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి కృషి చేశానని, ప్రధానంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించానని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సయ్యద్ సాబేర్ అలీ, శ్రీనివాస్ రాథోడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment