అన్నదానం మహాపుణ్యం
సిద్దిపేటజోన్: ‘ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రికి ఎందరో పేదలు వస్తుంటారు. వారికి అన్నం పెట్టడం పుణ్యకార్యంతో సమానం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన సేవలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి రోజుల పాటు నిస్వార్థంగా పేదలకు అన్నదానం చేయడం చాలా పుణ్యమైన పనిగా అభివర్ణించారు. మనుషులు ఆరాధించే భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాలు మానవసేవయే మాధవ సేవ అని చెబుతున్నాయన్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా పేదలకు మంచి చేయమనే చెబుతున్నాయని, అలాంటి మంచి కార్యక్రమాలకు సంపూర్ణంగా సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిది అతిక్ అహ్మద్‌ను సన్మానించారు. అంతకుముందు పట్టణంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు మోహిజ్, సాయి కుమార్ పాల్గొన్నారు.
వెయ్యి రోజుల పాటు దానం గొప్ప పని
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment